SLBC Incident : శ్రీశైలం వద్ద నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ టన్నెల్ నిర్మాణ పనుల సమయంలో మధ్యలో ఓ భాగం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చర్యలు తీసుకుంటూ, రెస్క్యూ ఆపరేషన్ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాయి. […]
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారు? […]
‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత! మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా […]
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై హైకోర్టులో న్యాయపరమైన పరిణామాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) , మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరువైపుల వాదనలు పూర్తయ్యాక హైకోర్టు తన తీర్పును […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన […]
Arabian Mandi : హైదరాబాద్ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, ఐటీ హబ్గా, వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ఈ అభివృద్ధికి అనుగుణంగా రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నగరవాసుల జీవన శైలిలో మార్పుల కారణంగా రెస్టారెంట్లపై ఆదరణ పెరిగినా, అందులో అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు హోటళ్లలో ఆహార నాణ్యత మాంద్యం చెందడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం సిద్ధం కావడం తీవ్ర సమస్యగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం […]
Kishan Reddy : ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కళాశాలల యాజమాన్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, నిర్లక్ష్య ధోరణిపట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. 14నెలల మీ పాలనలో ఆయా వర్గాలేవీ సంతృప్తిగా లేరనేది నిస్సందేహమని, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలను సైతం మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వాళ్లకు దక్కాల్సిన […]
CM Revanth Reddy : రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈ నెల 25తో ముగియనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తదితర ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా […]
Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషం, చీము నెత్తురు చచ్చిపోయినట్లుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు విచ్చేసిన బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…. మీలో పౌరుషం చచ్చిపోయిందా? చీము నెత్తురు లేదా? ఆనాడు మీ బిడ్డ పెళ్లినాడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా మిమ్ముల్ని అరెస్ట్ చేయించి జైల్లో వేయించిందన్నవ్ కదా? మిత్తీతో సహా చెల్లిస్తానని […]
బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు. […]