తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేయలేక బీజేపీ అధిష్టానం తల పట్టుకుంటోందా? వ్యవహారం కత్తి మీద సాములా మారిందా? ఎవరికి వారు మాదే పదవి, అంతా మేమేనని బిల్డప్‌లు ఇచ్చుకోవడం వెనకున్న లెక్కలేంటి? అసలెందుకు మేటర్ అంత సంక్లిష్టంగా మారింది? ఎప్పటికి తేలే అవకాశం ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ క్లైమాక్స్‌కి చేరింది. అయినాసరే…. ఇంత వరకు ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని కచ్చితంగా ముఖ్య నేతలు సైతం చెప్పలేని పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే ఇక ఏ రోజైనా హైదరాబాద్‌కు రావచ్చు. వన్ ఆమె వస్తే…. మేటర్ తేలిపోతుందని అంటున్నారు. ఆమె ఇక్కడ మీటింగ్ పెట్టి…. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారు. అటు పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం లేదు. పాత, కొత్త, దూకుడు, శాంతం… ఇలా రకరకాల ఈక్వేషన్స్‌తో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకేనని చెప్పుకుంటున్నారు. అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారని అంటే…. అబ్బో… వాళ్ళు చెప్పే లెక్కలు మామూలుగా ఉండటం లేదు. అవన్నీ చెప్పేసి… పార్టీ తమ వైపే మొగ్గుతుందని అంటున్నారు. ఎవరి కేలిక్యులేషన్స్ వాళ్ళు చెబుతూ… పెద్దల ఆశీర్వాదం తమకే ఉంటుందని అంటున్నారు. ఇదంతా చూస్తున్న కేడర్ మాత్రం ఏంటీ గోల…. అసలేంటీ గోల మాకు అంటూతీవ్ర అసహనం వ్యక్తం చేస్తోందట. పార్టీలో ఎన్నడూ లేనిది ఇదెక్కడి సంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదసలు మంచి సంప్రదాయం కాదని ద్వితీయ శ్రేణి నేతలు సైతం మండిపడుతున్నారట. ఒకరేమో పార్టీ అధ్యక్ష పదవి ఫలానా లక్షణాలు ఉన్నవారికే ఇవ్వాలని అంటుంటే… లక్షణాలు కాదు… సీనియారిటీ ముఖ్యం అన్నది మరొకటి మాట అట.
రాజా సింగ్ ఒకటి అంటే.. బండి సంజయ్ ఇంకోటి అంటున్నారు. ఇలా నాయకులు ఎవరికి వారే… తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయడంతో…. అసలేం జరుగుతోందో అర్ధంకాని గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని ఒక గ్రూప్‌కు ఇస్తే… మరో వర్గం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీల్లో ఎవరో ఒకరికి ఇచ్చినా… చివరికి వాళ్ళలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోందట. ప్రస్తుతం బీజేపీ ముఖ్య నేతల మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రధాని క్లాస్ పీకినా.. వీళ్ళలో మార్పు కనిపించడం లేదన్నది ఇన్నర్ టాక్. ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే… బండి సంజయ్ కి నచ్చదట. అలాగని బండికి ఇస్తే… ఈటలకు కష్టమట. ఒక ఎంపీకి అధ్యక్ష పదవి ఇస్తే… మిగతా ఎంపీలు జై కొట్టే పరిస్థితి లేదు పార్టీలో. కొత్త వారికి ఇస్తే పాత వారితో పంచాయతీ. పాత వాళ్ళకు ఇస్తే… మా సంగతేంటన్నది కొత్త నేతల క్వశ్చన్. ఇలా…. అందరికీ… వంద శాతం కాకున్నా, మెజార్టీ సభ్యులకు ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎంపిక చేయడం ఢిల్లీ పెద్దలకు కత్తిమీద సాములా మారిందట. దీంతో పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో, ఎవరివైపునకు మొగ్గుతుందోనని ఉత్కంఠగా చూస్తోంది తెలంగాణ బీజేపీ కేడర్.