Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల […]
SLBC : తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో సంభవించిన ఘోర ప్రమాదం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సిబ్బంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), భారత సైనిక బృందాలు (Indian Army Teams) రంగంలోకి దిగాయి. ప్రమాద స్థితిని అంచనా వేసి రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయడానికి సింగరేణి […]
Ponnam Prabhakar : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్ లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల […]
Kishan Reddy : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్లో కొంత భాగం కూలిపోవడంతో, అక్కడ పనిచేస్తున్న కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. ఈ హఠాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ విషాద ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ […]
R.Krishnaiah : బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది బీజేపీ […]
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు […]
MLA Raja Singh : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చాలావరకు ముస్లింలకు శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేక షాప్ లు ఇచ్చారని, అప్పుడు హిందూ.. ఇతర సంఘాలు కోర్టుకు వెళ్ళారు.. స్టే కూడా తెచ్చుకున్నారన్నారు. నిన్న శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాప్ లు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. మహా శివరాత్రికి […]
Srinivas Goud : పీవీ మార్గ్ లోని నీరా కేఫ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించుకు పోతున్న కుల వృతులను కాపాడాలని నాటి ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించారని, మీ కుల వృత్తిని కాపాడమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. నీరా పాలసీ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఆరోగ్య కరమైన నీరా పానీయం అందించే లక్ష్యం చేసిందన్నా శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రొడక్ట్స్ […]
KTR: కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లైస్ స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్ లకు పాల్పడుతున్నా కాపాడుతున్నదని ఆయన మండిపడ్డారు. సాక్ష్యాదారాలతో సహా అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన మౌనం వహిస్తున్నదన్నారు కేటీఆర్. గతంలో కాలేశ్వరం ప్రమాదంపైన అఘామేగాలపై స్పందించిన కేంద్రం… మెన్న సుంకిశాల ప్రమాదం పైన […]
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వే పకడ్బందీగా […]