Alleti Maheshwar Reddy : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా భూముల కేటాయింపు, పింఛన్లు, పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి, హైడ్రా విధానం, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “వందల కోట్ల ముడుపులు తీసుకుని 25 లక్షల చొప్పున భూములను పరిశ్రమలకు అప్పనంగా కట్టబెట్టారు. దేవాలయ భూములను కూడా పరిశ్రమలకు కేటాయించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, అయితే గత ప్రభుత్వ తరహాలోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా అన్నది చూడాల్సి ఉందని అన్నారు.
“కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం ప్రకటించాలి. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు పింఛన్‌ను రూ. 4,000కి ఎప్పటి నుంచి పెంచుతారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.
Drunken Drive : ట్యాంక్ ఫుల్‌గా తాగి.. ట్రాఫిక్ పోలీసులకు ట్యాంకర్ డ్రైవర్…
గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “పంచాయతీ కార్యదర్శులు ప్రతి నెలా 20,000 నుండి 30,000 రూపాయలు జేబులోంచి ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలను కూడా అందించకుండా వారిపై భారమోపుతోంది. దీనివల్ల వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు,” అని చెప్పారు.
హైడ్రా విధానం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. “హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుసార్లు హైడ్రాకు మొట్టికాయలు వేసింది. పేద, మధ్య తరగతి ప్రజలే హైడ్రా లక్ష్యమా?” అని ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చే ముందు ప్రభుత్వానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. “మేనిఫెస్టోలో లేని మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలని నిర్ణయించింది? అప్పులు కడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఎలా చేస్తోంది?” అని నిలదీశారు.
Physical Harassment : ఎంఎంటీఎస్ రైల్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం!