ఎంఎంటీఎస్ ఘటన బాధితురాలికి బండి సంజయ్ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ సభ్యులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బండి సంజయ్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డికి ఫోన్ చేసి వెంటనే సదరు యువతిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని సూచించారు. బండి సంజయ్ సూచన మేరకు డాక్టర్ శిల్పారెడ్డి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వెళ్లి అఫ్రోజ్ ను యశద ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని తరలించే విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారంటూ శిల్పారెడ్డి వాపోయారు.
పీ4 పై సమీక్ష.. సంపన్నులు-పేదలను ఒకేచోటుకు చేర్చడమే లక్ష్యం
పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ పీ4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చారు. ఉగాది సందర్భంగా అమరావతిలో పీ4 ప్రారంభం అవుతుందని సీఎం వెల్లడించారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్నారు. సంపన్నులు – పేదలను ఒకేచోటుకు చేర్చడమే దీని లక్ష్యమని తెలిపారు. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చని కోరారు. పేదలకు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు. 2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 73 వేల క్యాన్సర్ కేసులు.. నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని బలభద్రపురం గ్రామం హాట్ టాపిక్ గా మారింది. పదుల సంఖ్యంలో అక్కడి ప్రజలు క్యాన్సర్ భారిన పడడంతో తీవ్రకలకలం రేగింది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తూ వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొంత కాలంగా జరుతున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహించామని తెలిపారు.
లక్షల కోట్ల కంపెనీల ఓనర్.. అతను కూడా భార్య బాధితుడే
చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ.. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడు. అతను పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి ప్రసన్న శంకర్ నారాయణ.. ఇప్పుడు భార్య బాధితుడు అయ్యాడు. భార్య నుంచి విడాకుల గొడవతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఈ కేసులో చెన్నై సిటీ పోలీసుల తీరుపై ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులు.. వాటిని ప్రధాని మోడీకి ట్యాగ్ చేయటం సంచలనంగా మారింది.
మంచికి రోజుల్లేవ్.. ఇదే నిదర్శనం..
తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు.. సహాయం చేసిన చేతులనే నరికి వేస్తున్న సంఘటనలు.. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చినందుకు చంపి పాతర వేశాడు.. తన పాడు బుద్ధులను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు సహాయం చేసిన అడ్వకేట్ ని వేటాడి చంపేసిన తీరు ఇది. హైదరాబాదులోని చంపాపేట్‌లో జరిగిన దారుణ సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. పాతబస్తీ చంపాపేట్‌కు చెందిన ఎర్రబాబు ఇజ్రాయిల్.. ఇతను ఒక న్యాయవాది.. హైకోర్టుతో పాటు సిటీలోని అన్ని కోట్లలో కేసులను వాదిస్తుంటాడు.. ఒకటి అపార్ట్మెంట్లో ఉండగా మరొకటి ఇండిపెండెంట్ ఇల్లు ఉంది. ఇటీవల కాలంలో బతుకుతెరువు కోసం దస్తగిరి హైదరాబాద్కు వచ్చాడు..చిన్న చిట్కా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.. ఒకానొక సందర్భంలో దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్ కి పరిచయం అయ్యాడు ..ఈ పరిచయంతో న్యాయవాది చేరదీశాడు ..ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చిన న్యాయవాది ఇజ్రాయిల్ కు సహాయం చేసేవాడు. తన మరొక ఇంటిని ఇజ్రాయిల్ చూసుకునేవాడు.. ఏ చిన్న చితట్కా పని ఉన్నప్పటికీ న్యాయవాది ఇజ్రాయిల్ ఎప్పటికప్పుడు దస్తగిరికే చెప్తుండేవాడు ..గత కొన్ని రోజుల నుంచి దస్తగిరి ఇంటికి రావడం మానేశాడు. అర్జెంటు పని ఉందని రమ్మని చెప్తే మీ ఇంట్లో ఉంటున్న లేడీ తనను ఇబ్బంది పెడుతుందని చెప్పాడు ..అదే సమయంలో దస్తగిరి తనను వేధింపులకు గురి చేస్తున్నానని చెప్పి మహిళ వచ్చి న్యాయవాదికి ఫిర్యాదు చేసింది ..తనను లైంగికంగా వేధింపులకు దస్తగిరి గురి చేస్తున్నారని ఇబ్బందులు పెడుతున్నారని న్యాయవాదికి మహిళ కి చెప్పడం జరిగింది ..దీంతో దస్తగిరిని మందలిచినప్పటికీ సమస్య తీరిపోలేదు ..ఇక లాభం లేదనుకొని దస్తగిరి పైన పోలీసులకు న్యాయవాది పిర్యాదు చేశాడు. ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే..
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో స్కీములు లేవని.. అన్నీ స్కాములు మాత్రమే ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి హంద్రినీవా దాకా అంతా అవినీతే తాండవిస్తోందని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలు రింగ్ అవుతున్నాయి, దీనివల్ల సమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదంటు మండిపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారు. జ్యూడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారు. దీనిని పక్కనపెట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారని వెల్లడించారు.
ట్యాంక్ ఫుల్‌గా తాగి.. ట్రాఫిక్ పోలీసులకు ట్యాంకర్ డ్రైవర్…
హైదరాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుండి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్‌ఐ ఆంజనేయులు ట్యాంకర్ డ్రైవర్ యాదగిరిపై బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 325 బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) పాయింట్స్ నమోదయ్యాయి. ఇది అనుమతించిన పరిమితికి మించిపోయిందని గుర్తించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ పనితీరుకు సంబంధించిన 188వ నిబంధన కింద రమేష్ ఈ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో.. రిజిజు చేసిన తప్పుడు ప్రకటనలను ప్రస్తావిస్తూ, శివకుమార్ చేసిన వ్యాఖ్యలను అబద్ధం అని ఖండించారు. రిజిజు చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు అని పేర్కొన్నారు. ఇది ప్రత్యేక హక్కుల ఉల్లంఘన, సభ ధిక్కారానికి సమానం అని జైరాం రమేష్ నోటీసులో తెలిపారు. అలాగే.. సభలో తప్పుడు, తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం హక్కుల ఉల్లంఘన మరియు సభ ధిక్కారమే” అని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు జైరామ్ రమేష్ రాశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన రిజిజుపై ప్రత్యేక హక్కుల చర్యలు ప్రారంభించాలని ఆయన అభ్యర్థించారు.
కొత్త ఫించన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా భూముల కేటాయింపు, పింఛన్లు, పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి, హైడ్రా విధానం, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “వందల కోట్ల ముడుపులు తీసుకుని 25 లక్షల చొప్పున భూములను పరిశ్రమలకు అప్పనంగా కట్టబెట్టారు. దేవాలయ భూములను కూడా పరిశ్రమలకు కేటాయించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, అయితే గత ప్రభుత్వ తరహాలోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా అన్నది చూడాల్సి ఉందని అన్నారు. “కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం ప్రకటించాలి. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు పింఛన్‌ను రూ. 4,000కి ఎప్పటి నుంచి పెంచుతారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.
దొంగతనాలకు తల్లి స్కెచ్.. పిల్లలతో కలిసి చోరీలు.. చివరికి ట్విస్ట్.!
తల్లి డైరెక్షన్ తో పిల్లలు ముందుకు వెళ్తారు. అయితే తల్లి డైరెక్షన్ మంచిది అయితే ఇక్కడ స్టోరీ చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఆ తల్లి ఏకంగా ఒక డాన్.. పిల్లల్ని మంచి దిశగా తీసుకుని అవసరం ఉంది.. కానీ తన పిల్లల్ని కూడా తన దారిలోకి తీసుకొని వచ్చింది.. తల్లి దొంగతనాల కోసం స్కెచ్ వేస్తోంది.. ఆ తర్వాత పిల్లలు వెళ్లి దోచుకుని వస్తారు.. ముగ్గురు పిల్లలు తల్లి కలిసి హైదరాబాదులోని అత్యంత ధనవంతుడు ఉండే ప్రాంతాలను దోచుకుని పోతున్నారు. సనా డాన్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. దాదాపు ఇప్పటివరకు 50 పైగా దొంగతనాలు చేశారు.. ఎక్కడైతే ధనవంతుల ఎన్నో ఉంటాయో ఆ ఏరియాలో తల్లి వెళ్లి ముందుగా రెక్కీ చేస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారం పిల్లలకు చెప్తుంది.. రాత్రికి రాత్రే పిల్లలు వెళ్లి ఇల్లు మొత్తాన్ని గుల్ల చేసుకుని వస్తారు ..ఆ తర్వాత ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారు.