Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్‌తో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ […]
TG EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎన్జినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET) దరఖాస్తు ప్రక్రియకు మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 సాయంత్రం 4:45 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన పరీక్ష కన్వీనర్ డీన్ కుమార్, […]
Shivaraj Yogi : మహాశివరాత్రి హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా, ఇంకా ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు ఎంతో భక్తి, శ్రద్ధతో జరుపుకుంటారు. సాధారణంగా ఫాల్గుణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా పాటిస్తారు. ఈ రోజు శివభక్తులకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా, ఆధ్యాత్మికమైన విలువలు నిండిన రోజుగా భావించబడుతుంది. అయితే.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్‌కు చెందిన మహదేవ్ శక్తి సంస్థాన్, రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో […]
Harish Rao : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు భారీగా డబ్బు వెచ్చించారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు రూ.90 కోట్లు ఖర్చు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందజేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు […]
లోకేష్ కౌంటర్ ఎటాక్.. అవి మీకు అలవాటు.. మాకు కాదు..! ఏపీ శాసనమండలి వేదికగా మంత్రి నారా లోకేష్.. వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.. వైసీపీ కామెంట్లకు కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్.. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది వీసీలను బలవంతంగా […]
MLC Elections : కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టబద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. ఈనెల 27 న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత 15 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు అభ్యర్థులు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. పట్టభద్రుల స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ వార్ జరుగనుంది. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు పార్టీ అగ్రనేతలు.. కాంగ్రెస్ అభ్యర్థికి […]
CP Sudheer Babu : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఛేదించి సంచలనం రేపారు. గుజరాత్లో జన్మించిన పసి పిల్లలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి అమ్మకాల యత్నం చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఆడ శిశువులను రూ. 2.5 లక్షలకు, మగ శిశువులను రూ. 4.5 లక్షలకు విక్రయిస్తుండగా, పోలీసుల దాడిలో వారి పథకం భగ్నమైంది. దీనికి సంబంధించిన సమాచారం ముందస్తుగా అందుకున్న […]
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 కు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిస్తే రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారని, ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు తరఫున మండలి లో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలు చర్చకు తీసుకు వచ్చానన్నారు. […]
DK Aruna : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిచ్కుంద మండల కేంద్రంలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ బీజేపీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ అన్నారు. మంగళవారం కామారెడ్డి […]