US-Iran: అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం.. మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్
- అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం
- మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్
- టెహ్రాన్ దిశగా దూసుకుపోతున్న యుద్ధ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున అమెరికా యుద్ధ విమానాలు మోహరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 50 యుద్ధ విమానాలు, ఒక యుద్ధనౌకను పంపింది. డిపెండెంట్ ఫ్లైట్-ట్రాకింగ్ డేటా, మిలిటరీ ఏవియేషన్ మానిటర్ల ప్రకారం.. F-22, F-35, F-16 వంటి ఆధునిక యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యం వైపు వెళుతున్నట్లు కనిపించాయి. వీటితో పాటు అనేక వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్‌లు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే US సైన్యం సుదీర్ఘ సైనిక చర్యకు సిద్ధమవుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి.

Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
మంగళవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా జరిగిన అణు చర్చలు విఫలమైనట్లుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అణు చర్చల సందర్భంగా ఇరాన్ కీలక డిమాండ్లకు అంగీకరించలేదని.. చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. ప్రస్తుతానికి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలి విడత చర్చలు ఒమన్ వేదికగా జరిగాయి. అక్కడ చర్చలు ఫలించకపోవడంతో రెండో విడత చర్చలు మంగళవారం జెనీవా వేదికగా జరిగాయి. ఇక్కడ కూడా చర్చలు ఫలించలేదు. చాలా తక్కువ సమయంలోనే చర్చలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే.. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా క్షిపణి ప్రయోగాలు చేసింది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే రెండో విడత చర్చలు కూడా విఫలం కావడంతో భారీ యుద్ధ విమానాలు టెహ్రాన్ దిశగా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు అమెరికా-ఇరాన్ మధ్య 3 గంటల పాటే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన డిమాండ్లను అంగీకరించడానికి టెహ్రాన్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. అలా చర్చలు జరుగుతున్న సమయంలోనే టెహ్రాన్ హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక విన్యాసాలను ప్రారంభించింది.

చర్చల తర్వాత ట్రంప్ ప్రత్యేక రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రతినిధులు రెండు వారాల్లోపు కొత్త ప్రతిపాదనలతో తిరిగి రావచ్చన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలను తగ్గించే లక్ష్యంతో ఇవి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. ఈ చర్చలు నిర్మాణాత్మకమైనవి.. సానుకూలమైనవిగా అభివర్ణించారు. మునుపటి సమావేశం కంటే మెరుగైన పురోగతి సాధించామని చెప్పారు. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్-బుసైది మాట్లాడుతూ.. చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయన్నారు.
ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అతి పెద్ద నౌకతో పాటు మరిన్ని శక్తివంతమైన నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక శత్రువుల అంతు చూస్తోంది. ఇరాన్ సైన్యాన్ని ఒక దెబ్బకు నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ యుద్ధనౌకతో పాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, ఇతర నౌకలతో స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలో ప్రాణాంతక యుద్ధ విమానాలు ఉంటాయి. యుద్ధానికి దిగితే భూమి నుంచి.. సముద్రం నుంచి.. ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బకొట్టగల సామర్థ్యం ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..