Etela Rajender : సఫాయి కర్మచారుల సంక్షేమంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
- కేంద్ర మంత్రులతో బీజేపీ ఎంపీల భేటీ – కీలక అంశాలపై చర్చ
- సఫాయి కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ హామీ – ఎందుకు జాప్యం?
- రైల్వే అభివృద్ధి – వందే భారత్ స్టాప్ సహా కీలక డిమాండ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి కాళ్లు కడిగి సత్కరించారు. అయితే, చనిపోయిన సఫాయి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ తదుపరి రైల్వే మంత్రిని కలిసి తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను వివరించారు. సుచిత్ర వద్ద MMTS స్టేషన్ ఏర్పాటు అవసరమని, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని అంశాలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలో రైల్వే అండర్ పాస్‌లు, ఓవర్ బ్రిడ్జిల కొరత కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వందే భారత్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని కూడా రైల్వే మంత్రిని కోరారు.
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. హామీలు అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. హామీల అమలును నెరవేర్చేందుకు HCU భూములను అమ్మడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు చెందిన భూములు అమ్మితే నగరంలో పచ్చదనం మరింత తగ్గిపోతుందని హెచ్చరించారు. భూముల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటవ్వాలి కానీ, భూముల విక్రయం మాత్రం అప్రజాస్వామికమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!