SSC Exams : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈసారి తెలంగాణ టెన్త్ పరీక్షల్లో ఒక కీలక మార్పును చేపట్టారు. విద్యార్థులకు తొలిసారిగా 24 పేజీల బుక్లెట్ అందించనున్నారు. ఇంతకు ముందు […]
NTV Daily Astrology as on 21st March 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తిరుమలలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు. నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్న చంద్రబాబు కుటుంబం. తిరుమల: నేడు జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల.. ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ […]
Bandi Sanjay : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలైంది. అయితే, తగిన ఆధారాల్లేవన్న కారణంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ […]
Jupally Krishna Rao : హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక […]
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రైతుల దాకా అందరినీ మోసం చేసింది తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన […]
Shocking Incident : తెలంగాణలో మానవత్వం మంటగలిసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ, హృదయ విదారకమైన పాశవిక చర్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రోజా అనే యువతి తన స్నేహితురాలిని (26) ఇంటికి ఆహ్వానించి ఘోర మోసానికి పాల్పడింది. మద్యం తాగించి, ఆమెను మత్తులోకి నెట్టివేస్తూ, తన ప్రియుడు ప్రమోద్ చేత ఆమెపై అత్యాచారం చేయించింది. అంతేకాదు, ఈ దారుణ ఘటనను వీడియో […]
Fake Baba: తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేషధారణలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక దొంగబాబా అరెస్ట్ అయ్యాడు. మెదక్ జిల్లాలో పట్టుబడ్డ ఈ నిందితుడు, తనను “బాపు స్వామి”గా పరిచయం చేసుకుంటూ, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘోర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిందితుడు తనను మహాత్ముడిగా చిత్రీకరించుకుంటూ, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే తాను శక్తివంతమైన పూజలు చేసి నయం చేస్తానని నమ్మించాడు. తనను విశ్వసించిన మహిళలకు ప్రత్యేక […]
Ponguleti Srinivas reddy : ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం […]
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఈ ముఠాలో […]