TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడీఎస్ వెర్హౌస్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పాత క్యాంపస్), పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్లో జరగనుంది. అభ్యర్థులు విధిగా హాజరై, తాము అర్హత పొందిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను వెంట తీసుకురావాలని కమిషన్ సూచించింది.
వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా మరియు సమగ్ర సమాచారం కోసం TSPSC అధికార వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించవచ్చు. అభ్యర్థులు తమ పేరు లిస్టులో ఉందో లేదో ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుండి 24 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తప్పకుండా ఆప్షన్లను ఎంచుకోవాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేకు హాజరుకాలేకపోతే, లేదా అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురాకపోతే, తదుపరి అవకాశం ఇచ్చే ఉద్దేశం లేదని TSPSC ఖచ్చితంగా తెలిపింది. కనుక అభ్యర్థులు పూర్తిగా సిద్ధంగా ఉండాలి.
Bangladesh: భారత్ నిర్ణయం వల్ల మాపై ఎలాంటి ప్రభావం ఉండదు.. బంగ్లా మేకపోతు గాంభీర్యం..