KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, భవిష్యత్తులో BRS అధికారంలోకి రావడంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “సింగిల్గా అధికారంలోకి వచ్చేది […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో శనివారం మధ్యాహ్నం ఉత్కంఠభరితమైన చర్చ చోటుచేసుకుంది. రైతు సమస్యలు, రుణమాఫీ, వడ్ల బోనస్ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తూ – “నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. నా నియోజకవర్గంలో నేను తిరిగిన […]
Betting Apps: దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 357 బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ చర్యలలో భాగంగా 2,400 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, 166 మ్యూల్ అకౌంట్లను నిలిపివేయడం, మొత్తం ₹126 కోట్ల నగదును స్తంభింపజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 700కు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వీటి ద్వారా ప్రజలను మోసగిస్తూ పెద్ద ఎత్తున డబ్బులను విదేశాలకు […]
Etela Rajender : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) , కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేశారు. ఈ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు అని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అనేక సమావేశాలు నిర్వహించడం వెనుక వైఫల్యాలను దాచిపెట్టే ఉద్దేశమే ఉందని ఈటల అన్నారు. హైదరాబాద్లో ఒకటి కాదు, ఏకంగా 50 మీటింగ్లు పెట్టినా, […]
Delimitation : నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో సదస్సుకు హైదరాబాద్లో వేదిక కానుంది. పునర్విభజనకు సంబంధించి చెన్నైలో శనివారం నిర్వహించిన సదస్సు ఈ మేరకు తీర్మానించింది. సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల ప్రజల అభిమతానికి అనుగుణంగా రెండో సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తామని, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సదస్సులో పాల్గొన్నవారంతా మద్దతు తెలపడంతో […]
Tragedy : హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పదవ తరగతి పరీక్ష రాసి ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న ఓ విద్యార్థిని, ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు గాయాలయ్యాయి. సుమన్ ఛత్రియ అనే యువకుడు తన చెల్లి ప్రభాతి ఛత్రియ (16)ను స్కూటీపై తీసుకుని లింగంపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై ద్విచక్ర […]
Betting Apps : ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కారణంగా నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అయితే, సన్నీ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. నోటీసులు ఇచ్చిన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, పోలీసులు కీలక […]
Minister Seethakka : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా దేశంలోని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలను సహకారం చేస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. డి అడిక్షన్ సెంటర్ నిర్వహణ కోసం వికలాంగులు,వయోవృద్ధులు,ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ద్వారా 13 లక్షల 80 వేల […]
ప్రముఖ విదేశీ విద్యా సంస్థ సౌర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” హైదరాబాద్లోని JNTU బ్రాంచ్, KPHB (పిల్లర్ నం: A-724) వద్ద ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో విద్యార్థులకు ప్రపంచంలో ప్రముఖ దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాల గురించి సమగ్ర సమాచారం అందించనున్నారు. […]
Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్ఫోన్ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 2002లో సర్వే నంబర్ 530లో […]