గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. అయితే కలిసొచ్చి కుర్చీలో కూర్చున్నా…. దాన్ని ఎలా వాడుకోవాలో అర్ధంగాక తికమకలు, మకతికలు పడుతున్నారట ఆ ఎంపీసాబ్. పబ్లిసిటీ మోజులో తెగ పరేషాన్ అయిపోతూ…. అసలు తానేం చేస్తున్నానో… తన స్థాయి ఏంటో కూడా మర్చిపోయి సొంత పార్టీ ముఖ్యులకే అంతు చిక్కని పజిల్లా మారారాట. చివరికి చంద్రబాబు, లోకేష్ కూడా అతన్నెవరన్నా అపండర్రా….అని మొత్తుకోవాల్సి వస్తోందా? ఎవరా ఎంపీ? అంత తలనొప్పి పనులేం చేస్తున్నారు? కలిశెట్టి అప్పలనాయుడు….. విజయనగరం టీడీపీ […]
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, మైనార్టీల స్థానం, విద్యుత్ సబ్సిడీలు, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% గా ప్రకటించడం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. […]
ఆ ఎమ్మెల్యే ఏదో…… గొప్పగా…… సెటైరికల్గా మాట్లాడదామనుకుంటే….. చివరికి సుర్రు సుమ్మైపోయిందా? మాటలు మిస్ ఫైర్ అయిపోయి అట్రాసిటీ కేసు పెట్టించుకునేదాకా వెళ్ళాయా? ఫైనల్గా జంక్షన్ జామైపోయే పరిస్థితులు వచ్చాయా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ మాటలు బూమరాంగ్ అయ్యాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని వ్యవహారాలు ఆయన మీద అట్రాసిటీ కేసు బుక్ చేసేదాకా వెళ్లాయట. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ని ఉద్దేశించి […]
HYDRA : హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్న.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని పేర్కొన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే హైడ్రా లక్ష్యమా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అనే […]
ఇటుక అన్న మాట వినిపిస్తే చాలు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉలిక్కి పడుతున్నారట. కలలో ఇటుకలు కనిపించినా….భయంతో ఒళ్ళంతా తడిసిపోతోందట. ఇక అసలు ఇటుక బట్టీ అన్న మాట వింటే చాలు శివాలెత్తిపోతున్నట్టు సమాచారం. అసలేంటా ఇటుక పంచాయితీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇటుక ఫోబియా ఎందుకు పట్టుకుంది? నిజామాబాద్ జిల్లాలో ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడికి ఇటుక బట్టీల ఎమ్మెల్యేగా పేరు పెట్టారట బీజేపీ లీడర్స్. ఇటుక బట్టీల ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ.. ప్లెక్సీలు సైతం ఏర్పాటు […]
టీడీపీలో కోవూరు కోలాటం రసవత్తరంగా మారుతోందా? ఎమ్మెల్యే మాటల్ని మండల స్థాయి నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదా? అవినీతి, అక్రమాలకు దూరం ఉండమని పదే పదే చెబుతున్నా వాళ్ళ చెవికెక్కడం లేదా? ఎమ్మెల్యేనా…. అయితే ఏంటన్న ధోరణి పెరిగిపోతోందా? అసలేం జరుగుతోందక్కడ? నెల్లూరు జిల్లా కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు ..విడవలూరు.. ఇందుకూరుపేట మండలాల్లో విస్తరించి ఉంటుంది కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. […]
New Liquor Brands : తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత మద్యం మార్కెట్లో నూతన బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Prohibition & Excise Department) ఇప్పటికే కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్కు దరఖాస్తుల ఆహ్వానం తెలిపింది. ప్రారంభంలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 వరకు గడువు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు దానిని […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారా? గెలిచి 9నెలలవుతున్నా…. ఏం చేయలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? చివరికి తప్పు చేసిన వారిని శిక్షించలేకపోయానన్న బాధ ఆయనలో పెరిగిపోతోందా? అసలాయన ఏమన్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…2019లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీని వీడి టీడీపీ బీఫాం మీద పోటీ […]
McDonald’s : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ […]