Murder : కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించి, మద్యం వ్యసనానికి బానిసైన ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. మద్యం కొరకు ప్రతిరోజూ భార్యను డబ్బుల కోసం వేధిస్తున్న భర్త, ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది. షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల […]
SSC Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం ఆలస్యంగా చేరడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఇంకా ప్రశ్నపత్రం రాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా అన్ని పరీక్షా కేంద్రాలకు సమయానికి ప్రశ్నపత్రాలను పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, బాయ్స్ హైస్కూల్‌కు ప్రశ్నపత్రం చేరేందుకు గంటకు పైగా ఆలస్యం అయింది. […]
పాక్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ […]
Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ […]
Harish Rao : ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సభ తొలి క్షణాల్లోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ఆరంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై చర్చల్లో విపక్ష సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్లో నీతి పాఠాలు చెప్పడంలో బాగా రాణించారని వ్యంగ్యంగా అన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుతూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. గతంలో బడ్జెట్ అంచనాలను అతిగా పెంచి చూపించారని, ఈసారి మాత్రం […]
BRS vs Congress: తెలంగాణ శాసన మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి, ఫలితంగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి జూపల్లి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉంది. పూర్తిగా లేదనడం […]
BRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. […]
VC Sajjanar : ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిలో అందిస్తోన్న వైద్య సేవలను వీడియో రూపంలో తెలియపరిచి.. ప్రశంసించాడు కూకట్ పల్లి డిపో కండక్టర్ జీవికే యాదవ్. దీంతో కండక్టర్ ను అభినందిస్తూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ట్వీట్ చేశారు. ఆసుపత్రి విషయంలో కండక్టర్ ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని వెల్లడించారు. ట్వీట్ లో… TGSRTC అనేది 45 వేల మంది ఉద్యోగ […]
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు100 శాతం పెంపు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, […]
KTR : తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని […]