KTR : 2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి కీలకమని పేర్కొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇప్పటివరకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 28న అనుమతికి అప్లై చేసినప్పటికీ ఇంకా ప్రతిస్పందన లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని, రాష్ట్రం రూపుదిద్దుకునే దశలో పుట్టిన ఈ పార్టీ ఇప్పటికి అరవై లక్షల సభ్యులను కలిగి ఉందన్నారు. “రజతోత్సవం ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించే సభ కాదు, ఇది మేం ప్రతి సంవత్సరం జరుపుకునే వార్షికోత్సవ సభ మాత్రమే,” అని స్పష్టం చేశారు.
RTC బస్సుల కోసం ఇప్పటికే ₹10 కోట్లను చెల్లించామని, ఈ సభ అనంతరం ఏడాది పాటు రజతోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదాన్ని ప్రస్తావించిన కేటీఆర్, “ఆ భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే మేము అధికారంలోకి వచ్చాక తిరిగి రికవరీ చేస్తాం” అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “పెద్ద ఫేక్”గా అభివర్ణించిన కేటీఆర్, ఆయన బదులుగా “అపరిచితుడు” అని విమర్శించారు.
తమ హయంలో ప్రభుత్వ సంస్థలు భూములు అమ్మాయని అంగీకరించిన కేటీఆర్, ప్రస్తుతం బ్రోకర్ల చేతిలో భూములు అమ్ముబడుతున్నాయంటూ ఆరోపించారు. పదివేల కోట్ల రుణం కోసం రూ.170 కోట్లు బ్రోకర్ కమిషన్ చెల్లించారని, బీజేపీ ఎంపీ , బొంబాయి బ్రోకర్ కలిసి తాకట్టు పెట్టారని ఆరోపించారు. మూసీ నదిపై జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునేలా ప్రజలను దారి తప్పిస్తున్నారని, ఈ ప్రాజెక్టు వెనక లక్షా 50 వేల కోట్ల అవినీతి దాగి ఉందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి కళ్లెం వేసే శక్తి బీఆర్ఎస్‌కే ఉందని స్పష్టం చేశారు. “బీజేపీ, కాంగ్రెస్ వేరేవేరు అని అనుకుంటే విచారణకు ఆదేశించండి,” అంటూ సవాల్ విసిరారు.
CM Revanth Reddy : అత్యధిక ద్రవ్యోల్బణం నుండి అత్యల్ప స్థాయికి.. ప్రజల ప్రభుత్వం ప్రగతి ఇది