KTR : కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ఆదివారం ఒక అపశృతి చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. వెంటనే పార్టీ శ్రేణులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, ఆసుపత్రి అధికారులను సంప్రదించి, ఆమెకు అత్యవసర వైద్యసేవలు అందించాలని సూచించారు. తెలంగాణలో గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం […]
Congerss Minister : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, కాంగ్రెస్ భవిష్యత్ లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల […]
అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది. వివరాల్లోకి వెళ్తే.. భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడు మనోజ్‌కు ఫోన్ చేయించాడు. అయితే […]
KTR : కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ తాము దొంగనోట్లను ముద్రించారని ఆరోపించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, “మీరు కేంద్రమంత్రిగా ఉండి మమ్మల్ని దొంగలు అంటారు. అయితే, అప్పుడు కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు కదా? దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాల్సింది మీరే!” అని వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ […]
K.Keshava Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి […]
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని […]
Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు బీదర్‌లో దొంగనోట్ల ముద్రణ ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ముద్రించిన నకిలీ నోట్లే ఎన్నికల సమయంలో పంపిణీ చేసినట్లు ఆరోపించారు. తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అప్పులపాలైందని, ప్రస్తుతం రాష్ట్రంపై రూ.6 […]
పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో […]
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు […]
Blast : హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెత్తను తొలగించే క్రమంలో గుర్తు తెలియని కెమికల్ పేలుడు సంభవించి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. కుషాయిగూడలోని స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ఏరియాలో సాడక్ నాగరాజు అనే కార్మికుడు చెత్తను తొలగించే పనిలో ఉన్నాడు. పని చేస్తున్న సమయంలో, చెత్తలో మిళితమైన కొన్ని కెమికల్స్ ఆకస్మాత్తుగా పేలడంతో నాగరాజుకు తీవ్ర గాయాలు […]