Gutha Sukender Reddy : పెహల్గం ఘటన తర్వాత దేశ ప్రజల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. యుద్ధం కంటే ఉగ్రవాద నిర్మూలన చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. Gold Rates: […]
ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం శ్రేయాస్ అయ్యర్ (72), ప్రభ్సిమ్రాన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అనుభవజ్ఞులైన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందినవారు. గతంలో టీటీడీ జేఈవోగా విశిష్ట సేవలు అందించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎంసీఆర్ […]
Inter Admissions : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేశాయి. ఈ మేరకు, మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ (మే 1, 2025) నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు మే చివరి వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. Pakistan: ‘‘ […]
NTV Daily Astrology as on 1st May 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు. తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి. […]
TG SSC : తెలంగాణలో 2024లోని టెన్త్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు వచ్చిన 9.85 లక్షల మంది విద్యార్థుల్లో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ శాతం 1.47 పాయింట్ల మెరుగుదలని సూచిస్తోంది, ఇది విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం చేసిన ప్రగతి చాటుతుంది. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5,07,107 మంది […]
Jagga Reddy : మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ సీనియార్ నాయకులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హరీష్ నువ్వు బయట చాలా బిరుదులు తెచ్చుకున్నావని, ఒకడు ట్రబుల్ షూటర్ అంటారని, ఇంత పరిజ్ఞానం ఉన్న నువ్వు.. చిన్న లాజిక్ మర్చిపోయావన్నారు జగ్గారెడ్డి. గల్లీ నుండి ఢిల్లీ రాజకీయం వరకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనా? బీజేపీ పుట్టకముందే RSS ఉన్నది, అయితే ఈ రెండు పార్టీలు రాజకీయ అవగాహన కలిగి […]
పెళ్లి నిశ్చితార్థం ముందు స్నేహితుడి హత్య చూసి జీవితాన్ని విడిచిన యువకుడు సికింద్రాబాద్లోని వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక విషాద సంఘటన కలకలం రేపింది. మయ్ 4న నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు, తన మిత్రుడు హత్యకు గురవడం చూసి తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బౌద్ధనగర్కు చెందిన మోహన్ కృష్ణ అనే బైక్ మెకానిక్కు పెళ్లి నిశ్చితార్థం మే 4న జరగాల్సి ఉంది. అయితే, […]
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉందనే భావన పెరిగింది. అది నిజం కాదని నిరూపిస్తూ.. పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. కనీవినీ ఎరుగని ఘటనతో.. దేశం ఉలిక్కిపడింది. ఉగ్రదాడికి రూపకల్పన చేసిన పాకిస్తాన్ కు మరిచిపోలేని గుణపాఠం చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది. కశ్మీర్ మారిందనే ప్రచారం అబద్ధమని నిరూపించటమే ధ్యేయంగా ఉగ్రవాదులు తెగబడ్డారు. తాపీగా నడుచుకుంటూ వచ్చి పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నారు. అంతే తేలికగా పరారయ్యారు. గతంలో ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్ తో బుద్ధి […]