ఆమె యాక్షన్‌కి… ఈయన రియాక్షన్. అప్పుడైనా…ఇప్పుడైనా… ఆమెకి కౌంటర్ వేసేది ఆయనేనా..? పార్టీ ఇక ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్ మిసైల్ వదిలినా…. మన పార్టీకి ఎస్ 400లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళ మధ్యనే పొలిటికల్ యుద్ధం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే…. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ నే. బీజేపీ…కాంగ్రెస్ అంటూ మాటల తూటాలు ఎక్కు పెడుతున్నారామె. […]
NEET : జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరీక్షను ఒక్కే షిఫ్ట్‌లో నిర్వహించాల్సి ఉండటంతో, తగిన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS పేర్కొంది. త్వరలోనే పరీక్ష కోసం కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. Chennai Love Story : కిరణ్ […]
కొన్ని రోజులు మంట మీద పడ్డ మిరపకాయలాగా… చిటపటలాడిపోతారు. హాట్‌హాట్‌గా, ఘాటుగా కనిపిస్తారు. అంతలోనే… ఐస్ ముక్క పెట్టినట్టుగా కూల్ కూల్ అంటారు. పార్టీ వీడినా ఆ మాజీ ఎంపీని పాత బంధం అంత తేలిగ్గా వదలడం లేదా? గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఫైరైపోవడాలు అంతకంతకూ పెరుగుతున్నాయా? సడన్‌గా తన మాజీ బాస్ మీద ఆ మాజీ ఎంపీకి ఎదుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఎవరాయన? గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ ఆఫీస్ ఎగ్జిట్ డోర్ […]
Murali Mohan : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించే వ్యవస్థ అవసరం స్పష్టమవుతోంది. ఇటీవల పాతబస్తీలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ విషయంలో తీవ్ర ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం గణనీయమైన పరిణామంగా మారింది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి ఆధునిక […]
RBI : దేశంలో గడచిన కొన్ని సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు దశలవారీగా మార్కెట్ నుంచి తొలగించబడుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ శాతం నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా తిరిగి ఇచ్చారు. అయితే తాజాగా ఈ ప్రక్రియకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు తిరిగి వచ్చిన రూ.2 వేల నోట్ల పరిమాణం 98.26 శాతానికి చేరింది. ఇది మొత్తం విడుదల చేసిన […]
VC Sajjanar : హైదరాబాద్ నగర వీధులు రాత్రివేళల్లో వేడుకల వేదికలుగా మారిపోతున్న దృశ్యాలు ఇటీవల తరచూ కనపడుతున్నాయి. ముఖ్యంగా యువత బర్త్‌డే వేడుకలను బహిరంగంగా, పబ్లిక్ రోడ్లపై నిర్వహించడం కొత్త నాయా ట్రెండ్‌గా మారింది. మితిమీరిన సందడి, మద్యం మత్తులో అప్రమత్తత లేకుండా చేసే చేష్టలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అర్ధరాత్రి వేళ రోడ్లపై శబ్దాలతో, పాటలతో, హంగామాతో సాగుతున్న ఈ పండుగలు శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లోని భగాయత్ రోడ్ […]
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అయితే, విచారణకు మరింత సమయం కావాలని కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్ […]
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్‌లోని పార్క్‌లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో […]
TPCC Mahesh Goud : మాజీ మంత్రి హరీష్ రావును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని హరీష్ రావును ఉద్దేశించి స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు అనే మాట నిజమా?” అని ప్రశ్నించిన మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ఆస్తులు విలువ తగ్గించిన విధానాన్ని […]
Viral : పెళ్లంటే పండుగ, పరవశం, రెండు హృదయాల కలయిక.. కానీ ఒక్క కూలర్ కారణంగా పెళ్లి మ్యారేజ్ మూడ్ మొత్తం రచ్చగా మారిందంటే నమ్ముతారా..? ఇదే జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఓ పెళ్లిలో..! వధూవరుల తరపున కుటుంబ సభ్యుల మధ్య ఏవో చిన్నపాటి మాటల తేడాలు జరగడం సాధారణమే. కానీ ఇక్కడ విషయంలో తెరపైకి వచ్చినది – కూలర్! అవును, పెళ్లి మండపంలో వధూవరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూలర్ చుట్టూ గొడవ […]