Congress: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో, టీకాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బీసీ వర్గాలకు విద్య , ఉద్యోగ రంగాలలో మరింత న్యాయం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. Ajith : […]
Veera Raghava Reddy : గతంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి దాడికి గురయ్యాడు. గురువారం (మే 1, 2025) కండిషన్ బెయిల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డి […]
CM Revanth Reddy : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ […]
ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు. కుల గణనపై చర్చ, తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్న CWC. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న టీకాంగ్రెస్ బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ధన్యవాదాలు తెలపనున్న నేతలు. నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన. ప్రధాని మోడీ సభకు 5లక్షల మంది […]
MP Laxman : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కుల గణనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు స్పందన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, “రేవంత్ డీఎన్ఏలో అసలు కాంగ్రెస్ పార్టీ విలువలు లేవు” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కుల గణనకు ఎప్పటి నుంచో వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు ఓబీసీపై మొసలి కన్నీరు కారిస్తుంటే, […]
హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ మండలం కోహెడలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోహెడలోని సర్వే నెంబర్ 951, 952లో ఉన్న ప్లాట్ల యజమానులకు, అక్కడే ఉన్న ఒక ఫామ్‌హౌస్ యాజమాన్యానికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదం హింసాత్మక రూపం దాల్చింది. వివరాల ప్రకారం, కోర్టు ఆదేశాల మేరకు తమ ప్లాట్లను శుభ్రం చేసుకుంటున్న యజమానులను ఫామ్‌హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. అనంతరం ఫామ్‌హౌస్ వర్గీయులు ప్లాట్ల యజమానులపై రాళ్లు , […]
ప్రధాని సభకు రావాలంటూ జగన్‌కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని […]
CM Revanth Reddy : తెలంగాణలో కుల గణనపై ప్రభుత్వ ప్రకటన రాహుల్ గాంధీ నాయకత్వంలోని జోడో యాత్రలో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ, శాసన మండలి విపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కుల గణన దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన విధానం గురించి ముఖ్యంగా వివరించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు వెళ్లిన జోడో యాత్రలో కుల గణనపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “కుల గణన చేయడానికి అధికారంలోకి వస్తేనే […]
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది జూన్ 20, 21 తేదీలలో ఇంగ్లాండ్‌లో నిర్వహించబడనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ (Oxford India Forum) సదస్సుకు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సును ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి ప్రకటించారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను ఈ సదస్సులో భాగంగా వివిధ దేశాల నిపుణులు, […]
Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు […]