Viral : బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో జరిగిన ఘటన అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ భర్త, భార్యతో పిల్లల ఎదుటే తీవ్రంగా గొడవ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారు ఎంతగా గొడవ పడుతున్నా, ఇద్దరికీ పిల్లల మనస్తత్వం మీద పడే ప్రభావం గురించి ఆలోచన కూడా లేకపోవడం బాధాకరం. వీడియోలో భర్త కోపంగా భార్యను చెంపదెబ్బలు కొడుతూ కనిపిస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దృశ్యం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో వాళ్ల ఇద్దరు చిన్నారి బాలికలు మధ్యలో వచ్చి ఏడుస్తూ ఆపేందుకు ప్రయత్నించడం కలత కలిగించే దృశ్యం.
2026 Pongal Fight : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచే పుంజు ఎవరో.?
వీడియో చివర్లో భర్త భార్య గొంతు నొక్కిన వెంటనే వీడియో కట్ అయిపోతుంది. దీన్ని పోస్ట్ చేసిన కొంతమంది నెటిజన్లు.. భర్త భార్యను పిల్లల ముందే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నిజమైతే, ఆ ఇద్దరు చిన్నారుల మనసుపై ఇది ఎంతటి దెబ్బ వేసిందో ఊహించగలిగే విషయం కాదు. తల్లిని చచ్చిపోతూ చూసిన ఆ పిల్లలు జీవితాంతం ఈ సంఘటనను మరిచిపోలేరు. ఈ వీడియోపై ప్రస్తుతం అధికారుల దృష్టి పడినట్టు సమాచారం. నిజంగా ఇది గయాలో జరిగినదేనా? హత్య జరిగిందా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది.