Tragedy : పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య
- గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్
- గత నెల 17న కర్నూలుకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్న తేజేశ్వర్
- తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఉందని అనుమానాలు
- కర్నూలులోని ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని బంధువుల ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్‌కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్‌ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విన్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ఈ ఘోర నేరం వెనుక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత నెల 17న తేజస్విన్‌ను “భూమి కొలవాలి” అంటూ ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. పూడూరు శివారులో కారులోనే అతడిని కత్తులతో దారుణంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు. కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో తేజస్విన్ అత్త సుజాత గత కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అంతేకాకుండా.. ఐశ్వర్యతో కూడా తిరుమల్ రావుకు అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే.. ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో తేజస్విన్ అడ్డంకిగా మారాడని భావించి, అతడి హత్యకు పాల్పడ్డారనే అనుమానం బలంగా వినిపిస్తోంది.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ తీవ్ర కలకలం..
Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
గతంలో ఐశ్వర్యను తిరుమల్ రావు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. తిరుమల్ రావు భార్య నిరాకరణ కారణంగా ఐశ్వర్యను తాత్కాలికంగా వెనక్కి పంపినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, అన్ని పాత్రలు బయటపడే వరకు ఈ కేసు మరింత మిస్టరీగా మారనుంది. వివాహేతర సంబంధం, ఆస్తి లావాదేవీలు, అనుభవాలు, అనుమానాలు కలిసి ఒక అమాయకుడి జీవితాన్ని బలిగొన్నాయి. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ ఘటనను తలపించేలా, ఇది కూడా ప్రేమ పేరుతో జరిగిన పాశవిక నేరంగా మారింది.
Vijayawada: గోల్డ్ మార్కెట్‌లో 650గ్రా.ల బంగారంతో వ్యక్తి పరార్..!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!