Harish Rao : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా ప్రయోజన పథకాలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బందయినట్టే అని హరీష్ పేర్కొన్నారు. ఆత్మశుద్ధిలేని యాచార మదియేల, భాండశుద్ధి లేని పాకమేల? అనే సామెతను కోట్ చేస్తూ కాంగ్రెస్ నైతికతను ప్రశ్నించారు.
Nabha Natesh : అందం గేట్లు తెరిచేసిన నభా నటేష్..
బీఆర్‌ఎస్ ప్రారంభించిన పథకాలను అటకెక్కించి, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారు అంటూ ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటి పరుగులు తీసినా, చేతల పరంగా మాత్రం ప్రజలు ఇంకా నిరీక్షణలోనే ఉన్నారని హరీష్ వ్యాఖ్యానించారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని, పాలన అంటే ప్రతిపక్షాలపై కక్ష సాధించడమేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. యాదవ, కురుమ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఆయన ప్రస్తావించారు.
వంద రోజులలో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పిన వాడివి, కానీ ఇప్పటి దాకా డిడి డిపాజిట్ చేసిన వారి సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేని దుస్థితి మీది. మాటలు విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్ ముందు గొర్రెలతో నిరసన అని వ్యాఖ్యానించారు. మీ మోసాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారు.. ఇంకా జాగ్రత్త పడకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించారు.
Israel PM: యురేనియం ఎక్కడుందో మాకు తెలుసు: ఇరాన్ సీక్రెట్ స్థలంపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు