Phone Tapping : ఆరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు
- ఆరోసారి సిట్ విచారణకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు
- ఫోన్ ట్యాపింగ్‌లో రాజకీయ నాయకుల ప్రమేయంపై వెల్లడి వచ్చే అవకాశం
- విచారణలో సహకరించకపోతే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్న సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping : తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు లోనైన ఆయన, ఈసారి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో నిర్ధారించింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించట్లేదని సమాచారం. ఆయన నుంచి వచ్చే సమాచారంపై రాజకీయ పార్టీల నేతల ప్రమేయంపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read
ఇప్పటి వరకు జరిగిన ఐదు విచారణల్లో ప్రభాకర్ రావు సూటిగా సమాధానాలు ఇవ్వకుండానే తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. మావోయిస్టులతో సంబంధాల పేరుతో వందల మంది రాజకీయ నాయకులు, పాత్రికేయుల ఫోన్‌లు ఒకేసారి ట్యాప్ చేయడం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించినప్పటికీ, ఆయన క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. అందుకే ఈ వ్యవహారాన్ని సిట్ బృందం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ కేసులో ప్రస్తుతం మరికొంతమంది రాజకీయ నాయకుల స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు ఇవాళ రికార్డ్ చేయనున్నారు. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అనేక మలుపులతో ముందుకు సాగుతోంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?