Viral : వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అన్న మాటను మరోసారి నిజం చేసిన ఘట్టం ఇది. హర్యానాకు చెందిన ఓ తాతయ్య, తన మనవడు ఇచ్చిన ఫోర్డ్ మస్టాంగ్ కీతో కారులోకి ఎక్కి ఊహించని రీతిలో డ్రిఫ్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. సినీ స్టైల్లో స్టంట్లు చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. “తాత రాక్ – మనవడు షాక్!” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దేవ్ చహల్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో, […]
యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు. […]
Ponnam Prabhakar : హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి RTC బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్సు ప్రయాణం చేస్తూ, వారు ఇతర ప్రయాణికులతోపాటు మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి […]
KTR: వరంగల్‌లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోందని విమర్శించారు. 30 శాతం […]
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన […]
చైనాలో భూకంపం.. తీవ్రత 4.5గా నమోదు చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6:59 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్.. లక్షా 25 వేలు వసూలు చేసి..! కలియుగ ప్రత్యక్షదైవం […]
Konda Surekha : బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్‌తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి […]
Inter Supplementary : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సులో 2,49,032 మంది, ఒకేషనల్ కోర్సులో 16,994 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం జనరల్ కోర్సుకు 1,34,341 మంది, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. గత నెల (ఏప్రిల్ 22) విడుదలైన ఇంటర్ ఫలితాల్లో […]
2025-26 Academic: తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్లు & ఫీజులు నియంత్రణ కమిటీ) అనేక సార్లు సమావేశమైనా, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ కాలేజీలు ఆడిట్ నివేదికలను తమ అనుకూలంగా రూపొందించారని ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ , ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే ఫీజుల […]
Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ వాయు చక్రవాత ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేటి , రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో […]