భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందులో కాశ్మీర్ అంశంపై కూడా ఉందని పేర్కొన్నారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే […]
Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. […]
Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక […]
NTV Daily Astrology as on May 16th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ. విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన. మూడు […]
Tragedy : మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని షమ్నాపూర్ గ్రామంలో ఒక పాశవిక హత్య కేసు వెలుగు చూసింది. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఓ భార్య చివరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు ఒప్పుకుని షాక్‌కు గురి చేసింది. స్థానికంగా అందరినీ కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటనలో, లత అనే మహిళ తన భర్త శ్రీను ప్రయాణాన్ని ముగించడానికి మల్లేష్ అనే ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాహేతర […]
Bandi Sanjay : తెలంగాణలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వమే విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు […]
పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది.. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి […]
VC Sajjanar : టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ, “ఇదేం వెర్రి కామెడీ!? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన […]
Murder : నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని […]