LENIN : లెనిన్ పోస్టర్ వచ్చింది కానీ డేట్ మిస్ అయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, తన తర్వాతి ప్రాజెక్ట్ ‘లెనిన్‘ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ‘లెనిన్’ చిత్రాన్నిఈ ఏడాది సమ్మర్ కానుకగామే 1న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.
Also Read : PEDDI : బుచ్చి బర్త్ డే ‘పెద్ది’ స్పెషల్ వీడియో రిలీజ్
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
అయితే, నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ లుక్ ఆకట్టుకున్నప్పటికీ, ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించలేదు. దీంతో సినిమా పక్కాగా వాయిదా పడిందనే వార్తలు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వాయిదా వెనుక ప్రధాన కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అని తెలుస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు నిన్ననే అధికారిక ప్రకటన వచ్చింది. ‘పెద్ది’ విడుదలైన మరుసటి రోజే (మే 1న) అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే, ‘పెద్ది’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాతో పోటీ పడటం రిస్క్ అని భావించిన మేకర్స్, ‘లెనిన్’ విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి కొత్త విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ‘పెద్ది’ హవా తగ్గిన తర్వాత మే నెల చివరిలో లేదా జూన్‌లో అఖిల్ ‘లెనిన్’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అఖిల్ తన కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా అక్కినేని అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?