Tragedy : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం ఘనాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగమూర్తి అనే 65 ఏళ్ల వృద్ధుడు వీధిలోకి వెళ్లిన సమయంలో వీధి కుక్కలు అతనిపై దాడికి దిగాయి. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడినుంచి వచ్చాయో తెలియకుండానే ఒక్కసారిగా కూర్చున్న వృద్ధుడిపై విరుచుకుపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగమూర్తి రోజు మాదిరిగానే ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. అప్పటికి ఎవరికీ స్పష్టంగా కనిపించని వీధి కుక్కల గుంపు అతనిపై దాడి చేసింది. చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. గ్రామస్తులు గమనించి అతన్ని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది.
SSMB 29: రాజమౌళి ఫిల్మ్‌లో.. మహేశ్ డాడీగా తమిళ హీరో ?
ఇటీవల గ్రామంలో వీధి కుక్కల సంచారం పెరిగిందని, వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు వీధుల్లో భయంతో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు ఈ దాడిపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు నియమిత నిబంధనలు పాటించి శాశ్వత పరిష్కారం తీసుకురావాలంటూ మండల స్థాయిలో వినతులు వేస్తున్నారు.
Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..