Yash Dayal : రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు బౌలర్ యశ్ దయాల్ పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల కారణంగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కి చెందిన ఒక యువతి యశ్ దయాల్ పై కేసు పెట్టింది. దీంతో ప్రాథమిక విచారణ అనంతరం దయాల్ పై FIR నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసుతో అతని కెరీర్ కూడా ప్రమాదంలో వుంది. ఇక ఆ యువతి యశ్ దయాల్ గురించి చెప్తూ, మేమిద్దరం 2019లో సోషల్ మీడియా ద్వారా కలిశామని, అప్పటి నుండి సన్నిహితంగా ఉన్నామని పేర్కొంది. దాంతో పాటు యశ్ దయాల్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు ప్రాంతాలకు తీసికెళ్ళి శారీరక సంబంధాన్ని కొనసాగించాడని తెలిపింది. అయితే కెరీర్లో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి, ఇప్పుడు తనను బ్లాక్ చేసాడని ఆరోపించింది.
Nitish Kumar: ఎన్నికల వేళ మహిళలపై నితీష్ వరాలు.. ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటన
వీటితో పాటు యశ్ తో దిగిన ఫొటోలు, చాట్ లు, వీడియో కాల్స్ ని ఫిర్యాదులో జత చేసింది. ఇక వేరే మహిళ నుండి కూడా డబ్బు తీసుకున్నాడని తెలిపింది. ఇదిలా ఉండగా దీనిపై ఇప్పటివరకు యశ్ దయాల్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీ తరుపున యశ్ దయాల్ ఆడుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీ కప్పు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఆర్సీబీ టీంకు కీలక బౌలర్ గాను మారిపోయాడు. ఇప్పుడు ఈ కేసుతో తన కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ కూడా వుంది. ఇక దయాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు మరియు ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో ఇటు బీసీసీఐ కూడా ఏదైనా చర్యలు తీసుకుందేమో చూడాలి.
Bajaj Pulsar NS 400Z: రేసింగ్ లుక్‌తో రీడిజైన్‌డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల..!