ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్లో గల రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్ భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్ చేసిన వాహనాలు […]
కుటుంబాన్ని వదిలి అడవిలో బతుకుతున్న మావోయిస్టులు లొంగిపోవాలంటూ పోలీసులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాలకు చెందిన 43 మంది మావోయిస్టులు.. పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. సుక్మా జిల్లా గాధిరాస్, చింతగుఫా, కుక్నార్, పుల్బగ్డీ గ్రామాలకు చెందిన వీరు బుధవారం ఎస్పీ సునీల్ శర్మ, సీఆర్ఫీఎఫ్ అధికారుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే వీరికి రూ.10 వేల […]
తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యాశాఖలో 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇన్ స్ట్రక్టర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయలు, కేజీబీవీలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్ రెసిరెన్షియల్ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కో-ఆర్డినేటర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేసేందుకు అనుమతులు జారీ […]
ఎగువ నుంచి భారీ వరద నీరు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే అధికారులు 2 క్రస్ట్ గేట్ల ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 67,378 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 70,836 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం […]
గత నెల 12వ తేదిన విధులు ముగించుకోని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న (23)అనే మహిళ కానిస్టేబుల్ సెప్టెంబర్ 12న విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలు దేరింది. అయితే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్ పైకి రాగానే అనుకోకుండా జ్యోత్స్న నడుపుతున్న […]
కశ్మీర్ లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా కశ్మీర్ ను చెప్పుకోవచ్చు. అలాంటి కశ్మీర్ లోని ప్రజల్లో చైతన్యం నింపడానికి ఓ ఆర్మీ అధికారి సంచనల వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్టన్ వెళ్లినప్పటి నుంచి కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎంతో మంది కశ్మీర్ పౌరులను ఉగ్రవాదులు […]
ఏపీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు. అంతేకాకుండా పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు. పట్టాభిరామ్ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. దీనితో పాటు నిన్న 5.03 నిమిషాలకు తెలియని […]
టీడీపీ నేతలు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు. చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి […]
ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర […]
శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు బయలు దేరిన స్కూల్ బస్సు చెరువులో పడిపోయింది. బుధవారం ఉదయం ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో ఈ ఘటన జరిగింది. 8 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు చెరువులో పడిపోవడంతో.. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను కాపాడారు.. అప్పటికే ఒక విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. విద్యార్థి మృతితో ఆ […]