గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఆ వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా సుమారు ఏడాది పాటు నిరసనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
అంతేకాకుండా ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వాటిని రద్దు కూడా చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ వ్యవసాయ చట్టాలను తీసుకువస్తుందని, రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఇటీవల రద్దు చేసిని వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు వారి స్వలాభం కోసం రైతులను గందరగోళంలో పడేసే విధంగా వ్యవహరిస్తున్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.