కాశ్మీర్‌లో పోలీసు, భద్రతా దళాల ఉమ్మడి బృందాలు గత 48 గంటల్లో 6 గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంత్‌నాగ్‌లోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా దళాలపై కాల్పులు తెగబడ్డాడు.
దీంతో ఎదురుకాల్పులు చేసి ఆ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 6గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఆరుగురిలో ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్సై మహ్మద్ అష్రఫ్‌ను హత్య చేసిన ఉగ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.