అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పేద బ్రహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వనుంది. ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా మరణించిన 40 రోజుల లోపు […]
రాజేంద్రనగర్లోని హైదర్ గూడకు చెందిన అనీష్ మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకు అపార్ట్మెంట్ సెల్లార్కు వెళ్లిన అనీష్ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని అనీష్ తల్లిదండ్రులు సాయంత్రం గుర్తించి పోలీసులకు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా అనీష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముందుగా ఓ మహిళ కిడ్నాప్ చేసినట్లు భావించిన పోలీసులు అది నిజం కాకపోవడంతో హైదర్ గూడ పరిసరాలను తనిఖీ చేశారు. దీంతో […]
కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్స్కు రూ.10లక్షల రుణాలు బ్యాంకుల ద్వారా అందింస్తామని తెలిపారు. మేడారం జాతరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కిషన్రెడ్డి, మేడారం జాతర గురించి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, అభివృద్ధి […]
హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఎస్సై బీ.సైదులును సస్పెండ్ చేసినట్లు రాచకొండి కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. పలు కేసుల విషయంలో ఆరోపణలు, క్రిమినల్ కేసుల్లో సెటిల్మెంట్ లు చేస్తున్నట్లు తేలడంతో ఎస్సై సైదులును సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పోలీసులు పారదర్శకతతో విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పు చేస్తే ఎవ్వరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పట్టాభిరామ్ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్ కు నవంబర్ 2 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్టాభిరామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ రోజు ఉదయం తరలించారు. […]
ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల నిధులతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిభ కలిగిన శిల్పకారులతో ఆలయంలోని స్థంభాలు డిజైన్ చేయిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో అడుగడుగునా అబ్బురపరిచే కళానైపుణ్యం దర్శనమిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం దాతలు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 36.16 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా […]
కరోనా మహమ్మరి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్దాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొవిడ్ టీకాలను తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీకా ఉత్సవ్ విజయవంతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా తరువాత 100 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ మైలురాయి దాటిన రెండవ దేశంగా భారతదేశం చరిత్ర లిఖించింది. అంతేకాకుండా కొవిడ్ టీకాలపై అపోహలు పక్కన పెట్టి […]
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో […]