నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. అయితే ఈ మహాసభలు తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు సీపీఎం మహాసభలు జరుగునున్నాయి. ఈ మహాసభలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం హజరుకానున్నారు. ఆయనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.
నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించిన కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టికెట్లు విడుదల చేస్తారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ కోసం నేడు నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టేందుకు పోలీసులను అనుమతి కోరగా.. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ కార్యాలయంలో సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రి 4 గంటల వరకు జరుగనుంది. ఈ దీక్షలో తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ పాల్గొననున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం నేడు ఎర్రవెల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఎర్రవెల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అంక్షలు అమలు చేయనున్నారు.
నేడు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. 2022లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కోవిడ్ ఉధృతి దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా.. వద్దా అనే విషయంపై చర్చించనున్నారు.
నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ వేడుకకు సీఎం జగన్ హజరుకానున్నారు.
నేడు రాజమండ్రిలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతూనే ఉంది.
నేడు ఏపీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నందిగామ ఎంఎంఆర్ కళాశాలలో ఈ జాబ్‌మేళా జరుగనుంది. 18-30 ఏళ్ల లోపు వారు హజరుకావచ్చని ఏపీఎస్‌ఎస్‌డీసీ వెల్లడించింది.