Jupally Krishna Rao : చర్లపల్లి ఘటనపై మంత్రి కీలక నిర్ణయం
- ఆబ్కారీ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
- కల్తీ మద్యం, డ్రగ్స్‌పై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్ష లేదు
- చర్లపల్లి ఘటనపై మంత్రి కీలక స్పష్టీకరణ
- నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao : హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్లో రాష్ట్ర ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం, డ్రగ్స్ హడల్స్‌ట్రేషన్ వంటి సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఎక్కడైనా కల్తీ మద్యం లేదా డ్రగ్స్ లాంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని అధికారులకు స్పష్టంగా హెచ్చరించారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
చర్లపల్లి ఘటనపై వస్తున్న వార్తలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్కడ 12 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తలు వాస్తవం కాదని, నిజానికి 3 నుండి 4 కోట్ల వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశామని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రదేశం పెద్ద ఫ్యాక్టరీ కాకుండా చిన్న షెడ్ మాత్రమేనని, అక్కడ కొంతమంది డ్రగ్స్ తయారీ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న సమయంలో పట్టుకున్నామని వివరించారు. ప్రభుత్వ పరువు పెంచే విధంగానే వ్యవహరించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను సహించబోమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేసినా వదిలేది లేదని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Dammannapet : దమ్మన్నపేటలో అడవి హక్కులపై ఘర్షణ, ఫారెస్ట్ అధికారులపై ఆదివాసీల ఆగ్రహం
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!