Drugs : ట్యూషన్ క్లాసుల వెనక దాగిన మత్తు రహస్యం.!
- బోయిన్‌పల్లిలో ఈగల్ టీం భారీ ఆపరేషన్
- స్కూల్ ముసుగులో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ బహిర్గతం
- ఆల్ఫా జోలం పెద్ద ఎత్తున స్వాధీనం, నలుగురు అరెస్ట్
- ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడుకు సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : సికింద్రాబాద్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్‌పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు. బోయిన్‌పల్లిలోని మేధా హై స్కూల్‌ను మూసివేసి, దాని లోపలే డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గౌడ్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి. అతను స్కూల్‌ను మూసివేసి, పగటి పూటల్లో డ్రగ్స్ తయారీ చేయగా, సాయంత్రం మాత్రం ట్యూషన్ తరగతులు నడిపేవాడట. ఈ విధంగా ఎవరికి అనుమానం రాకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తెలిసింది.
ప్రమాదకరమైన ఆల్ఫా జోలం అనే మత్తుమందును స్కూల్‌లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మత్తుమందును నగరంలోని కల్లు కాంపౌండ్లకు, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. స్కూల్‌లోని మూడు అంతస్తుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నాలుగు రియాక్టర్ల సహాయంతో ఆల్ఫా జోలం తయారీ కొనసాగించారని అధికారులు తెలిపారు. ఇప్పటికే అక్కడి నుంచి 20 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
సమాచారం అందుకున్న ఈగల్ టీం ముందుగా గౌడ్ దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా 5 కిలోల ఆల్ఫా జోలం మత్తుమందు స్వాధీనం చేసింది. అనంతరం స్కూల్ లోపల నిర్వహించిన సోదాల్లో మరో 5 కిలోల ఆల్ఫా జోలం, నాలుగు రియాక్టర్లు, పలు రసాయనాలు, నగదు, తయారీకి సంబంధించిన పరికరాలు దొరికాయి.
అదే సమయంలో ఆల్ఫా జోలం తయారీలో పాల్గొంటున్న నలుగురు కార్మికులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని గౌడ్ స్కూల్ లోపలే ఉంచి డ్రగ్స్ తయారీలో ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బోయిన్‌పల్లి పరిసరాల్లో కలకలం రేగింది. స్కూల్ ముసుగులో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ జరగడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కేసులో గౌడ్‌తో పాటు మరికొందరు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించిందో, ఎవరు ఇందులో భాగస్వాములయ్యారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసిన ఆల్ఫా జోలం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఆపరేషన్‌తో సికింద్రాబాద్ డ్రగ్ మాఫియాకు గట్టి దెబ్బ తగిలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!