Chutneys Restaurants : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని బ్రాంచ్‌లలో పరిశీలనలు చేసిన అధికారులు పలు అపరిశుభ్ర పరిస్థితులు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. తనిఖీల్లో వంటగదులు అపరిశుభ్రంగా ఉండటం, మూసుకుపోయిన మురుగు కాలువలు, జిడ్డుగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కనిపించాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాలో మూతలేని డస్ట్‌బిన్లు, రిఫ్రిజిరేటర్ల మధ్య తిరుగుతున్న బొద్దింకలు ఉండటం అధికారులు రికార్డ్ చేశారు.
Eye Twitch Astrology: ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే!
అదే సమయంలో ఆహారం తయారీ విభాగంలో పని చేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం కూడా టాస్క్‌ఫోర్స్ దృష్టికి వచ్చింది. ఆహార భద్రతా ప్రమాణాలు (FSSAI) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల సమాచారం ప్రకారం, ఆహార నాణ్యత, శుభ్రతకు భంగం కలిగించే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై తనిఖీలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు.
Rajiv Shukla: బీసీసీఐకి ఎలాంటి మినహాయింపులూ లేవు.. వేల కోట్లు జీఎస్టీ చెల్లిస్తున్నాం!