బీజేపీ తీరుపై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జీవో 317లో సవరణల కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు కోర్టులో హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు సికింద్రబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు చెబుతున్నా, ర్యాలీని చేసితీరుతామంటూ బీజేపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ‘డ్రామా ప్రారంభమైంది.పార్ట్ 1. బండి సంజయ్ అరెస్ట్, పార్ట్ 2. జేపీ నడ్డాజీని ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. తెలంగాణలో బీజేపీని ప్రాథమిక ప్రతిపక్షంగా చూపించడానికే ఇదంతా చేస్తున్నారు.? ఇప్పుడు దీన్ని నేనే పబ్లిక్ చేశాను. డ్రామా ఎలా జరుగుతుందో చూద్దాం’ అంటూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read
DRAMA Starts!!
Part-1: Bandi Sanjay Arrest.
Part-2: JP Nadda ji to be taken into CUSTODY today.
All this to show BJP as the primary opposition in Telangana?Now that I made this Public, lets watch the drama unfold..@INCIndia @RahulGandhi
— Revanth Reddy (@revanth_anumula) January 4, 2022
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?