విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన విజయవాడలో జనవరి 1న ప్రారంభమైంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే బుక్ ఫెయిర్ సందర్భంగా నేడు పుస్తక ప్రియులు పాదయాత్రి నిర్వహించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ నుంచి స్వరాజ్ మైదానం వరకు ఈ పాదయాత్ర జరిగింది.
అయితే ఈ పాదయాత్రను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాదయాత్రను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా నడిపించారు. ఈ పాదయాత్రలో వివిధ కళారూపాలతో పాఠశాల చిన్నారు అందరినీ ఆకర్షించారు. 1992 నుంచి ఏటా సాహితీవేత్తలు, ప్రముఖులతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పుస్తక పఠనంపై అందరిలో ఆసక్తి పెంచేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.