తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ ది అని ఆయన ఆరోపించారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997 లో కాకినాడలో తీర్మానం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. మలి ఉద్యమంలో బలి అయిన అమరులకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారని, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విభజన కోసం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుందని రేవంత్ అన్నారు.
తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారని, ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో బిల్స్ ఓటింగ్ జరగాల్సి వస్తే, సభ తలుపులు ముస్తారని, ఇది చట్ట ప్రక్రియ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను సైతం మోడీ వంచించాడు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. బంగాళాఖాతంలో దూకి ప్రధాని ఆత్మహత్య చేసుకోవాలి.. తెలంగాణా కోసం పదవి త్యాగం చేయకుండా, మోడీ వెనుక దాక్కున్నాడు.. కిషన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి.. మోడీ తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి అని నిరూపించుకున్నాడు అని రేవంత్ ధ్వజమెత్తారు. మోడీ మాట్లాడుతుంటే టీఆర్‌ఎస్ ఎంపీలు నోరెత్తటం లేదని, మోడీ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!