ప్రధాని మాట్లాడిన మాటలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలకు అర్థం అయినట్టు లేదు.. నరేంద్ర మోడీ తెలంగాణకి వ్యతిరేకమని అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ తమ మనుగడ కోసం ఎప్పుడు పడవ మునిగి పోతుందోనని భయంతో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డిని మేము కూడా అనవచ్చు… పొట్టోడు, చిటికెన వేలు అంత లేడని.. గతంలో మాట్లాడిన మీ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ఆయన మండిపడ్డారు.
1997లో మీరు రాజకీయాల్లోకి రాలేదు… మీరు ఎక్కడ నుండి ఎక్కడకు వచ్చారో గుర్తించుకోండి.. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు అడ్డుకున్నాడని ఎల్కే అద్వానీ అన్నారు అని ఆయన అన్నారు. 2004 లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటించింది… 2009లో ప్రకటించి వెనక్కి తీసుకొంది… ఆ తరువాతే తెలంగాణలో ఆత్మ బలిదానాలు మొదలు అయ్యాయి. టీడీపీ రణభేరికి వస్తున్న అని తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కి పెట్టింది రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. మోడీ పార్టీ ల పాలసీ ల పై మాట్లాడారు… వ్యక్తుల పై ఓటుకు నోటు దొంగ అని మాట్లాడలేదు అని ఆయన వెల్లడించారు.