ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారని, తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని, రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని ఆయన అన్నారు. మోడీ ఆయనకు తెలంగాణపై ఉన్న అక్కసును వెళ్లగక్కారు.. తెలంగాణ ప్రజలు గమనించాలని హరీష్ రావు అన్నారు.
బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, 2014లో తెలంగాణనే రాకపోతే ఈ అభివృద్ధి సాధ్యం అయ్యేనా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిందని మనం సంతోషపడితే ప్రధాని మోడీ ఎందుకో దుఃఖ పడుతున్నాడని, తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా అక్కసు వెళ్లగక్కుతాడు.. ద్వేషం చిమ్ముతాడని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్ర తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట, తెలంగాణ బాగుపడుతుంది… కానీ మోడీకి నచ్చడం లేదు అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.