ఆ 8లక్షల ఉద్యోగాలు కేంద్రం భర్తీ చేయాలి : రాజ్యసభ ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న సమయంలో ఖాళీలు భర్త చేయకపోవడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షల పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీలు మంగళవారం డిమాండ్ చేశారు. జీరో అవర్ ప్రస్తావన ద్వారా సమస్యను లేవనెత్తిన ఎంపీ విజయసాయి రెడ్డి, నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ రంగం ఖాళీలతో నిండిపోతోందని అన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, సాయుధ దళాలలో లక్ష, రైల్వేలో రెండు లక్షలతో సహా కేంద్ర ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. “ప్రభుత్వం ఖాళీలను నోటిఫై చేయడం లేదు. పరీక్ష నిర్వహించడం లేదు, ఫలితాలను ప్రకటించడం లేదు” అని విజయసాయిరెడ్డి అన్నారు.
పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లు, కోర్టులలో వ్యాజ్యాల కారణంగా కొంత ఆలస్యం జరిగి ఉండవచ్చు. వివిధ మంత్రిత్వ శాఖలు అందించిన సమాచారం ప్రకారం సాయుధ దళాల్లో 1,25,555, రైల్వేలో 2,65,547, గెజిటెడ్ పోస్టులు 80,752 ఖాళీగా ఉన్నాయని వి శివదాసన్ (సీపీఎం) తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ విభాగాల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. డిసెంబరులో నిరుద్యోగం 8 శాతానికి చేరిన సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (ఎల్‌జేడీ) తెలిపారు. మంజూరైన పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని, యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
Also Read
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
తాజావార్తలు
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!