భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పరిపాలన సాగిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్‌లో కూడా ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలను పలకరిస్తే కంటోన్మెంట్ ప్రాంతం కాశ్మీర్‌లా మారిందంటూ పలువురు సమాధానం చెప్పడం గమనార్హం. వారి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తిరుమలగిరి, మారేడ్‌పల్లి, అమ్ముగూడ, హకీంపేట, జవహర్ నగర్, కార్ఖాన, బోయిన్పల్లి, కౌకూర్, బొల్లారం ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్మీ అధికారులు విధించే […]
కరోనా రక్కసి మహారాష్ట్రను వదలనంటోంది. డెల్టా వేరియంట్‌తో ఇప్పటికే మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సైతం మహారాష్ట్రలో విజృంభిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. దీంతో 8 మంది పోలీసులతో సహా మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత […]
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 6,317 కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కరోజులో 318 మంది కరోనా సోకి చనిపోయినట్లు తెలిపారు. వీరితో పాటు 3,900 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 78,190 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో పాటు దేశంలో 138.95 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు […]
హైదరాబాద్‌లో లోన్ యాప్స్ అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజుల వ్యవధిలో సిటీ పోలీసులకు 4 ఫిర్యాదులు అందాయి. యూసఫ్‌గూడాకు చెందిన ఓ యువతి లోన్ యాప్ ద్వారా రూ.10 లక్షలు లోన్ తీసుకుంది. అయితే సదరు యువతిని వేధింపులకు గురి చేసి లోన్ యాప్ నిర్వాహకులు అదనంగా రూ.2.9 లక్షలు దండుకున్నారు. అలాగే కృష్ణానగర్‌కు చెందిన మరో మహిళ లోన్ యాప్ నుంచి రూ.33వేలు రుణం తీసుకుంది. అయితే గడువు తీరిందని ఫేక్ నోటీస్ లెటర్ […]
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుండి ఢిల్లీ చేరుకుంది. అయితే ఈ లేడీ కిలాడి ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్లో విచారణ చేయగా డ్రగ్స్ గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల ప్రత్యేకంగా బాక్స్ లు ఏర్పాటు చేసి, అందులో 14 కోట్ల విలువ చేసే 2.2 […]
36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆఫ్సెట్ బాధ్యతలను ఆలస్యం చేసినందుకు గాను ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌పై భారత ప్రభుత్వం జరిమానా విధించింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూరో 7.8 బిలియన్ల ఒప్పందంలో ఆఫ్సెట్ హామీలను నెరవేర్చడంలో జాప్యం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఫ్రెంచ్-భారత ప్రభుత్వాలు సెప్టెంబరు 2016లో యూరో 7.8 బిలియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, కాంట్రాక్ట్ విలువలో 50 […]
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సీఎస్ సమీర్ శర్మ కమిటీ 14.29 ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదకను సమర్పించారు. అయితే ఈ నివేదిక ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అయితే పీఆర్సీసై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారు […]
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ పలు దేశాలకు వ్యాపించగా అక్కడ పలు ఆంక్షలు విధించారు. కొన్ని దేశాల్లో విమాన రాకపోకలపై నిబంధనలు పాటిస్తున్నారు. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ విజృంభన పెరిగిపోతుండడంతో తాజాగా యూకేలో ఒక్కరోజే 15,363 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటడంతో ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళన చెందుతున్నాయి. యూకేలో ఇప్పటి వరకు […]
మనకు మామూలుగా పెయింటింగ్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది పికాసో. ఎందుకంటే పెయింటింగ్స్‌లో ఆయన అంత ప్రావీణ్యం కలవాడు కాబట్టి. అయితే పందుల్లో కూడా పెయింటింగ్స్‌లో ప్రావీణ్యం కలిగిన ఓ పంది ఉంది. దానిపేరే పిగ్కాసో. సౌతాఫ్రికాలో ఉంటున్న ఈ పందిని చిన్నప్పుడే తన యజమాని ఓ మటన్ షాపుకు అమ్మేశాడు. అయితే ఆ మటన్‌షాపు యజమాని దీనిని వధించి వంటకు వాడాలనుకున్నాడు. కానీ.. అంతలోనే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జువానే లెఫ్సన్ అనే మహిళ […]
కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కొండపల్లిలోని 29 స్థానాలకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ15, వైసీపీ14 స్థానాల్లో గెలుపొందింది. అయితే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా సాగడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5గంటలకు సీఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలు భేటీ […]