సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.18 వేలకు అమ్ముతున్నారని, మధ్య, పేద తరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆయన అన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి పవన్ ప్రస్తావించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలని, […]
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు […]
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ముందడుగు వేసింది. రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్స్ తొలి విడుతగా 51 లోకో వీల్స్ తయారీ చేసింది. లోకో వీల్స్ తయారీ కోసం రూ. 1700 కోట్లతో లాల్ గంజ్, రాయబరేలీలో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా నిన్న రాత్రి 51 లోకో వీల్స్‌ని ఇండియన్ రైల్వే కి వైజాగ్ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించిన విషయం […]
ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న భారత్‌ను ఒమిక్రాన్ టెన్షన్ పట్టిపీడిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాపించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 39 నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 263కు చేరుకుంది. తెలంగాణలో కొత్తగా 14, గుజరాత్ 9, కేరళలో 9, రాజస్థాన్‌లో 4, హర్యానా, […]
యూపీలో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పూర్వాంచల్‌లో అమూల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు టీటీడీ వర్చువల్ సేవ టికెట్ల కోటా విడుదల చేయనుంది. జనవరి వర్చువల్ సేవాల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 5,500 చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. నేడు తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్స పర్యటించనున్నారు. ఈ […]
కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి తీవ్రం అవుతుందని, తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులు అందరూ వెళ్ళిపోతారు… మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. అందుకే […]
తండ్రీకూతుళ్ల మధ్య గాఢమైన ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. అందుకే కూతురు పెరుగుతున్న ప్రతి దశలో తండ్రి తన కోసం ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. ఒక్కోసారి చిన్నతనంలో ప్రతి ఆటలో గెలిచే సూపర్‌మ్యాన్ పాత్రలో, ఒక్కోసారి కూతురికి వీడ్కోలు పలికే సమయంలో చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఇంటి నుంచి వెళ్లిపోతున్న కూతురు, తండ్రి కళ్లలో తనపై అత్యంత నమ్మకం, ఆశను చూస్తుంది. అయితే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శివపురిలో టీ స్టాల్ […]
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం. దీంతో టీడీపీ అధినేత దీక్షలు చేపట్టడం.. అనంతరం పట్టాభి అరెస్ట్, అసెంబ్లీ సమావేశాల ఘటన ఇలా ఒక్కో ఘటనకు ఏపీ రాజకీయాలు అతిథ్యమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల నారా భువనేశ్వరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి […]
గత అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. దీంతో ఈ విషయంపై నిరసన జ్వాలలు కూడా రగిలాయి. అయితే తాజాగా భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]
ఏజెన్సీ ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే గత సోమవారం సాయంత్రం ములుగు జిల్లాలోని కె.కొండాపురం మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఛతీస్‌గఢ్‌లోని కొత్తపల్లి సమీపంలో రమేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో రమేశ్‌ను మావోయిస్టులు […]