జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాలను ఆధారంగా వెతుకుతున్న క్రమంలో డిజిటల్ కార్పొరేషన్‌లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్ పెట్టిన కేసులో మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం జడ్డీలను దూషించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసులో న్యాయవాది చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
అంతేకాకుండా హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ముగ్గురిని అధికారులు విచారించారు. ముగ్గురు నిందితులను హైదరాబాద్ నుంచి గుంటూరు కు సీబీఐ అధికారులు తరలించారు. అనంతరం నిందితులను న్యాయమూర్తి వద్ద పోలీసులు హజరుపరిచారు. జడ్జీలపై కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాల ఆధారంగా వెతుకుతూ పోయినప్పుడు.. డిజిటల్ కార్పొరేషన్ లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. జడ్జీలపై పోస్టులను అక్కడే తయారుచేయించి, అక్కడి నుంచే సోషల్ మీడియాలోకి వదిలినట్లు సీబీఐ అనుమానిస్తోంది.