తూర్పుగోదావరి జిల్లా కడియంలో రెండు తలలతో గేదెదూడ జన్మించింది. అనంతరం 1 గంటలోపే మరణించిన సంఘటన మండలంలోని మురమండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పాడిరైతు తూలూరి వీరకాసు మకాంలో నిన్న రాత్రి ముర్రా జాతి గేదెకు రెండు తలల లేగదూడ జన్మించింది. ఈ వార్త ఆ నోటా ఈ నోటా గ్రామమంతా వ్యాపించింది. గ్రామ ప్రజలు లేగదూడను చూసేందుకు ఎగబడ్డారు. ఇంతలోనే ఆ దూడ మరణించడంతో నిరుత్సాహపడ్డారు. జన్యులోపంతో బహు అరుదుగా ఇలాంటి లేగదూడలు జన్మిస్తాయని […]
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి వరంగల్‌లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం ఉదయం ఆయన సిద్ధంకాగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సోమవారం కూడా రేవంత్ […]
కీసరలోని సాయిధామం ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామనందప్రభు స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ సాయిధామం ఆశ్రమ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, అందుకు అడ్డుపడుతున్నందుకే స్వామీజీపై ఈ వేధింపులా అంటూ భక్తులు మండిపడుతున్నారు. అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆశ్రమ సభ్యులు, హిందూ సంఘాల నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామిజీని విడుదల చేయాలంటూ ఆందోళన […]
కరోనా మహమ్మారి విజృంభన మరోసారి కొనసాగుతోంది. కరోనా డెల్టా వేరియంట్‌కు తోడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ సైతం దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికాలో 5.37 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో అమెరికాలో 1300 మందికిపైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో సైతం […]
గత నెల క్రితం వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చింగ్లెపేట్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చైన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సీఎం స్టాలిన్ […]
నేటి నుంచి జనవరి 9 వరకు శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి రోజు వేకువజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు. ఢిల్లీలో నేడు జీఎస్టీ మండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత వహించనుండగా జీఎస్టీ మండలి భేటీ కానుంది. పన్ను రేట్ల హేతుబద్దీకరణ ప్రధాన అజెండాగా జీఎస్టీ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు […]
ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీపీఎం పార్టీపై చేసిన వ్యాఖ్యలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు కౌంటర్ ఇచ్చారు. చీప్ లిక్కరుపై బీజేపీకి అంత మోజు ఉంటే వాళ్ల ఆఫీసుల ముందు పెట్టి అమ్ముకోవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చీప్ రాజకీయాలు చేసి ప్రజల దృష్టిని మద్యంపై మళ్లించే ప్రయత్నం చేస్తున్న బీజేపీని విధానాలను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. కమ్యూనిస్టులు పెరుగుతున్నారనే నిస్పృహ సోము వీర్రాజు మాటల్లో కన్పిస్తోందని, తమతో సఖ్యతగా […]
భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రియలన్స్ ఇండస్ట్రీస్ పగ్గాలు ముఖేష్ కుమారు ఆకాష్ అంబానీ చేతుల్లోకి వెళ్లాయి. ఇటీవల ధీరుబాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే రిలయన్స్ ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీ చైర్మన్ మారుతాడని, అంతేకాకుండా మరికొన్ని మార్పులు కూడా ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే నేడు ఆయన కుమారు ఆకాష్ అంబానీకి రిలయన్స్ సంస్థ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ధీరుభాయ్ […]
ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలో దాదాపు 4 రోజుల పాటు ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కలకలం రేగింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా […]