ఛత్తీస్‌గఢ్‌లో మొన్నటికి మొన్న ఓ మాజీ ఉప సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను మరవకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మానసిక వికలాంగుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని అతడిని బీజాపూర్ జిల్లా బాసగూడలో హత్య చేశారు. అయితే గతంలోనూ మాజీ ఉప సర్పంచ్‌ను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నేపంతో ప్రజా కోర్టు శిక్షించినట్లు మావోయిస్టులు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఓ వికలాంగుడు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణతో జన మిలీషియా సభ్యులు […]
గత సంవత్సరం నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలుదేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఈ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో చెప్పినదాని కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 94 కొత్త ఒమిక్రాన్ కేసులు […]
మరోసారి కరోనా రక్కిసి రెక్కలు చాస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత 15 రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా సుమారు 7 వేల లోపు కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా కేసులు రాగా, 284 మంది కరోనా బారినపడి మృతిచెందారు. గడిచిన 24 […]
యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంప దేశాలపై విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు కూడా భారీ పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.39 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తాజాగా […]
రేపటి నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిర్వహించనన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రోజుకో రూపంలో శ్రీరామచంద్ర స్వామి దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా పగల్ పత్తు, రాపత్తు, విలాస ఉత్సవాలు నిర్వహించన్నారు. రేపు మత్య్సావతారం, 4వ తేదీన కూర్మావతారం, 5న వరాహావతారం, 6న నరసింహావతారం, 7న వామనావతారం, 8న పరశురామావతారం, 9న శ్రీరామావతారం, 10న బలరామవతారం, 11న శ్రీకృష్ణావతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 12వ […]
తెలుగు రాష్ట్రల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఏపీలోని మాడుగులలో 8.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, పాడేరు, అరుకులలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని కొమురంభీం జిల్లాలోని సిర్పూర్(యు)లో 11.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిన్నెదరిలో 12.1, తిరగయాణిలో 13 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 13.3, పిప్పల్ […]
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పుడు జరిపారు. న్యూఇయర్ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి కాల్పులు జరిపారు. ఒక్కసారి తుపాకీ పేలిన శబ్దం వినడంతో వేడుకల్లో ఉన్న జనం పరుగులు పెట్టారు. అమెరికాలోని మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కాల్పుల్లో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. […]
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా డెల్టా వేరియంట్ కేసులు, ఇప్పుడు మరోసారి భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాల్లోకి ప్రవేశించింది. దీంతో ఒమిక్రాన్ కేసులు కూడా యూఎస్, యూకే లాంటి దేశాల్లో అధికంగానే నమోదవుతున్నాయి. వీటితో పాటు ఒమిక్రాన్ మరణాలు సంభవించడంతో ఆయా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. రోజురోజుకు ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా […]
నేడు యూపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చండ్ స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొచ్చిలో ఇంటిగ్రేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేడు కరీంనగర్లో జాగరణ దీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు […]
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని పదే పదే చెబుతున్నామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతర్గత కమిటీల ఏర్పాటు లక్ష్యంగా కమిషన్ పని చేస్తుందని, మహిళా కమిషన్ ఈ రెండున్నర సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్, చిన్నారులపై అత్యాచారాలు పైనా ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో మహిళా కమిషన్ జోక్యంతోనే అరెస్టులు జరిగాయన్నారు. […]