పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో పురోగతి కనిపించింది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాతి కాలేజ్ లో పేపర్ లీకైనట్లు ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజ్ పై ఆపరేషన్ జరుగుతోంది. స్వాతి కాలేజ్ పేపర్ లీకేజి ఘటనలో నలుగురు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు కాలేజ్ సిబ్బందితో పాటు అబ్జర్వర్‌ను సైతం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పరీక్షకు అరగంట ముందు పేపర్ లీక్ జరిగిందని, స్వాతి కాలేజ్ నుండే పేపర్ లీక్ అయినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. స్వాతి కాలేజ్ కి గత ఏడాది నుండి అడ్మిషన్స్ తక్కువ కావడంతో అడ్మిషన్స్ కోసం స్టూడెంట్స్ ను పాస్ చేయించాలని ప్లాన్ చేసి పేపర్ లీక్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో స్వాతి కాలేజ్ స్టూడెంట్స్ కు పరీక్ష సమయానికి అరగంట ముందే స్వాతి కాలేజ్ యాజమాన్యం పేపర్‌ను లీక్ చేసింది. ఈ నేపథ్యంలో స్వాతి కాలేజ్ స్టూడెంట్స్ తమ స్నేహితులకు వాట్సప్‌లో పేపర్ పంపడంతో పేపర్ లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది.