నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. రోజుకు 15 వేల చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.
మరోసారి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నేడు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేయనుంది. ఈ రోజు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేయనున్నారు.
ఏపీలో నేటి నుంచి జెన్‌కో సంస్థల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ చేయనున్నారు. వేతనాలు చెల్లింపు, పింఛన్లు చెల్లించాలని ఉద్యగులు డిమాండ్ చేస్తున్నారు. జనవరి నెల వేతనాలు జమ కాలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శికి విద్యుత్ ఉద్యోగుల జేసేఈ లేఖ రాసింది.
నేటి నుంచి తెలంగాణలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు.
నేడు ముంబైలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జైలుకెళ్లే బీజేపీ నేతల చిట్టా ఈ రోజు బయటపెడతానని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన నిర్వహించే మీడియా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.