కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270కు చేరుకుంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్ నుండి వచ్చిన ఓ కుటుంబంలో 50 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ గా నిర్ధారణైనట్లు వైద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు […]
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారం రేపాయి. దీంతో రాధా అంశంపై స్పందించిన బెజవాడ సీపీ క్రాంతి రానా మాట్లాడుతూ.. రాధా రెక్కీపై నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని, మాకు రాధా రెక్కీపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా 2 నెలల సీసీ టీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం పరిశీలిస్తామని, ఘటనపై పూర్తి స్థాయి […]
2021 ముగింపు సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు కోవిడ్ సమయంలో ప్రజలతో పాటు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేశారన్నారు. తెలంగాణలో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం కుదిరిందని,ఈ సంవత్సరం మొత్తం ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని ఆయన అన్నారు. మావోయిస్ట్ సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సక్సెస్ అయ్యిందని, తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు పోలీస్ శాఖ […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా […]
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే […]
ఇటీవల విడుదలైన పుష్ఫ సినిమాలు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టమ్స్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు పుష్పరాజ్ అవతారం ఎత్తారు. బాధ్యతయుతమైన పోస్టుల్లో ఉండి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు ఆ అధికారులు.. సీబీఐ చొరవతో ఆ అధికారులు గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఓ ముఠాతో కలిసి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు. దీంతో కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. […]
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే సతమతమవుతున్న ప్రజలకు ఇప్పడు ఒమిక్రాన్ మరింత భయాన్ని రేపుతోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలను తారుమారు చేస్తూ మరింత శరవేగంగా ఒమిక్రాన్ వ్యాపించడం ఆందోళన కలిగించే విషయం. కేంద్ర […]
రోజురోజుకు భారత్‌లో కోవిడ్ విజృంభన పెరిగిపోతోంది. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో పాటు తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను తీవ్రతరం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి రెండు […]
నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ […]
రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఇద్దరు మైనర్ అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీగా మారింది. వేరు వేరు ప్రాంతాలలో ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే టైలరింగ్ నేర్చుకోవడానికి ఓ విద్యార్ధిని వెళ్లగా స్కూల్ కు మరో విద్యార్ధిని వెళ్లింది. అయితే ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన విద్యార్థినీలు సాయంత్రం ఎంతకీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల వెతికి, సమీప బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా ఫలితం లేకపోయింది. […]