Fodder Scam : లాలూనే దోషి.. తేల్చిన సీబీఐ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని మరో నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ ప్రసాద్ చివరి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. విచారణ సందర్భంగా కోర్టులో భౌతికంగా హాజరు కావడానికి ఆర్జేడీ అధినేత ఆదివారం రాంచీకి వచ్చారు. లాలూ ప్రసాద్‌కు సంబంధించిన రూ.139.35 కోట్ల డోరండా ట్రెజరీ దుర్వినియోగం కేసులో జనవరి 29న వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రసాద్‌తో సహా 99 మంది నిందితులపై ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి ఎస్కే శశి గత ఏడాది ఫిబ్రవరి నుంచి విచారణను పూర్తి చేశారు. చివరి నిందితుడు శైలేంద్ర కుమార్ తరఫున వాదనలు జనవరి 29న పూర్తయ్యాయి. తీర్పు వెలువడే రోజున నిందితులందరూ భౌతికంగా కోర్టులో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే 1996లో దాణా కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. దాణ కేసులో 1997లో లాలును నిందితుడిగా సీబీఐ చేర్చింది. 25 ఏళ్ల తర్వాత లాలూప్రసాద్ యాదవ్ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పునిచ్చింది.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?